చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్
అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
చలి చీమే ఆదర్శం పని కాదా నీ దైవం
ఆయువే నీ ధనం ఆశయం సాధనం
చేయరా సాహసం నీ జయం నిశ్చయం
అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
చిలిపి బాలుడనుకుంటే చిటికెనేలు అనుకుంటే
కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం
సీత కానీ లేకుంటే చేతకాదు అనుకుంటే
విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం
మనసుంటే కనపడదా ఏదో మార్గం
కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం
ఓరిమే నీ బలం లోకమే నీ వశం
చేయరా సాహసం....నీ జయం నిశ్చయం
రాయి లాగ కూర్చుంటే కాలు కదపలేనంటే
ఎప్పటికి రాదుగా ఊహలకో రూపం
బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే
భయపడక వెలిగించెయ్ నెత్తురుతో దీపం
యే చీకటి ఆపును రా రేపటి ఉదయం
యే ఓటమి ఆపును ర రాగల విజయం
కాలమే నీ పధం కోరికే నీ రధం
చేయరా సాహసం.. నీ జయం నిశ్చయం.
అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon